Friday, June 1, 2007

టింబక్టు

నాకు మొట్టమొదట టింబక్టు గురించి అనంద్ అన్నయ్య చెప్తే ఏముందిలే చిన్న ఊరే కదా అనుకున్నాను. కానీ, అన్నయ్య పదే పదే చెప్తున్నాడు ఏదో విశేషం ఉందనే అనుకున్నాను. అప్పటినుంచి ఎప్పుడు టింబక్టు వెళదామా అని అనుకున్నాను. ప్రతిభ అక్కయ్య పెళ్లి తరువాత రిసెప్షన్ కని అనంతపురం వెళ్ళాం. రిసెప్షన్ ఐపొయిన మరుసటి రోజు మేము టింబక్టు వెళ్లాము. అనంతపురం లో బస్సు ఎక్కి చెన్నేకొత్తపల్లి లో బస్సు దిగాము. అక్కడ టిఫిన్ చేయడానికి ధరణి హోటల్ కు వెళ్ళాము. అక్కడ నేను మూడు రొట్టెలు, మూడు గ్లాసుల రాగిమాల్ట్ తాగాను. అక్కడి నుండి మేము చిల్డృన్స్ సెంటర్ కు వెళ్ళాము. అక్కడ పిల్లలకు కుట్టడం, కంప్యూటర్, కీచైన్స్, పెన్ స్టాండ్స్ చేయడం నేర్పిస్తారు. అక్కడ ఒక లైబ్రరీ కూడా ఉంది. మేం ఆ రోజు మద్యాహ్నం వరకు ఆ లైబ్రరీ లోనే ఉన్నాం. మాకు అప్పటికీ అక్కడి నుండి వెళ్ళాలనిపించలేదు. కానీ, ఆకలేయడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయాం. వేళ్ళే ముందు నేను మూడు పుస్తకాలు తీసుకున్నాను. టింబక్టు చేరిన తరువాత బాగా ఆకలేయడంతో వెంటనే కిచెన్ లోకి వెళ్ళి అన్నం తినేశాం. ఆ ఊళ్ళో రెండే రెండు కిచెన్లున్నాయి. ఒకటి గెస్ట్లు, విజిటర్లు తినడానికి. ఇంకొకటి స్కూల్లో పిల్లలు తినడానికి. మేీము సాయంత్రం దాకా ఆడుకోవడం, చదువుకోవడం వంటివి చేశాము. అక్కడ ఒక ఈతకొలను ఉంది. సాయంత్రం ఐదు అవ్వగానేీ మేము ఆ ఈతకొలను లో దూకి ఆడుకొనేవాళ్ళం. మళ్ళీ పొద్దున్నేీ ఒక కొండ ఎక్కే వాళ్ళం, కొండ దిగి వచ్చిన తరువాత ఈతకొలను లో దూకి ఒక పావుగంట ఆడుకొనేవాళ్ళం. ఆ తరువాత స్నానం చేసి టిఫిన్ తినేవాళ్ళం. అందరూ ఒక మూడు రోజులు ఉండి వుండి వెళ్ళిపోయారు. నేీను, జాహ్నవి అక్క, మాధవి అక్క ఇంకో మూడు రోజులు అక్కడే వున్నాం. చివరి మూడు రోజులూ మేం మొదటి రోజు లాగే ఆడుకున్నాం. 2వ రోజు చిల్డ్రెన్స్ సెంటర్ కు వెళ్ళాం. అక్కడ జాహ్నవి అక్క మాధవి అక్క కీచైన్స్ చేీయడం నేర్చుకున్నారు. నేను మాత్రం కంప్యూటర్ తో ఆడుకున్నాను, లైబ్రరీ లో బుక్స్ చదివాను. ౩వ రోజు మేం మళ్ళీ చిల్డ్రెన్స్ సెంటర్ కు వెళ్ళాం. అక్కడ మాధవి అక్క, జాహ్నవి అక్క పెన్ స్టాండ్స్ చేీయడం నేర్చుకున్నారు. నేీను మాత్రం లైబ్రరీ లో బుక్స్ చదువుకున్నాను, నిద్రపోయాను. 4వ రోజు పొద్దున్నే లేచి రెడీ అయ్యి చెన్నేకొత్తపల్లి వేళ్ళాము. అక్కడ బస్సు ఎక్కి బెంగుళూరు చేరాము.

Thursday, May 24, 2007

first post

This is my first post.